Hi Friends తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పరిపాలనను బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించేందుకు (GPO – Grama Palana Officer) గ్రామ పాలన అధికారి అనే పదవిని పరిచయం చేసింది. ఈ ఉద్యోగాలు గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో పారదర్శకత, బాధ్యత, ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ అభివృద్ధికి కేంద్రంగా గ్రామ పాలన అధికారుల నియామకం ఒక ప్రగతిశీల చర్యగా నిలుస్తోంది. ఈ GPO ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
6000 GPO Vacancies
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,954 GPO ఉద్యోగాలకు మార్చి 22 నాడు ఆమోదం తెలిపింది.
- ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు.
- ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 26th వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు తీసుకున్నారు.
- ఈ ఉద్యోగాలకి మొదట మాజీ VROS/VRA లు అంటే ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్లు లేదా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని నిర్ణయించారు.
- So ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం 10,954 GPO ఉద్యోగాలలో, దాదాపు 5000 మాజీ VROS/VRA లను నింపగా, సుమారు 6000 GPO ఉద్యోగాలు మిగులుతాయి.
- ఈ 6000 GPO ఉద్యోగులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Responsibilities GPO Officer
గ్రామ పాలన అధికారి విధులలో ప్రధానంగా వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, గ్రామస్థాయిలోని ఇతర అధికారులతో సమన్వయం చేయడం ఉన్నాయి. వారి ముఖ్య బాధ్యతలు:
- గ్రామానికి సంబంధించిన భూమి, జనాభా, సంక్షేమ లబ్దిదారుల వివరాలను నిర్వహించడం
- పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పథకాలు, ఉపాధి వంటి పథకాల అమలులో సహకరించడం
- ప్రజల ఫిర్యాదులను సమయానికి పరిష్కరించడం
- గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ కార్యదర్శి తదితరులతో కలసి పరిపాలనా పనుల్లో భాగస్వామ్యం కావడం
- రహదారులు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యా సదుపాయాల వంటి అభివృద్ధి పనుల పర్యవేక్షణ
- ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించడం, ప్రజలను పాలనలో భాగస్వాములుగా చేయడం
ఈ విధంగా, గ్రామాల్లో ప్రత్యక్షంగా ఒక అధికారిని ఉంచడం వల్ల సేవల అందుబాటులో పెరుగుదలతో పాటు ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించగలుగుతాయి.
Qualifications and Selection Process
గ్రామ పాలన అధికారుల నియామకాన్ని సాధారణంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహిస్తుంది. అర్హతలు క్రింది విధంగా ఉంటాయి:
- విద్యార్హత: 10+2 విద్యా అర్హతను నిర్ణయించాలని ప్రభుత్వం యూవచిస్తున్నట్లు సమాచారం లేదా డిగ్రీ చేసినవారికి అవకాశం కల్పిస్తుంది.
- వయసు పరిమితి: సాధారణంగా 18 నుండి 44 సంవత్సరాల మధ్య, రిజర్వ్ కేటగిరీలకు వయసు మినహాయింపు ఉంటుంది
- భాషా ప్రావీణ్యం: తెలుగు భాషలో నైపుణ్యం అవసరం; కొన్నిచోట్ల ఉర్దూ తెలిస్తే అదనపు ప్రయోజనం
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ధృవపత్రాల పరిశీలన ఉంటాయి. రాత పరీక్షలో సామాన్య అభిజ్ఞానం, తెలంగాణ చరిత్ర, ప్రస్తుత వ్యవహారాలు మరియు పరిపాలనా అంశాలు ఉంటాయి.
Salary
- గ్రామ పాలన అధికారి ఉద్యోగం ద్వారా గ్రామీణ యువతకు ప్రభుత్వ సేవలో ప్రవేశించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది. వేతనం సుమారు ₹28,940 నుండి ₹78,910 వరకు ఉండవచ్చు. అనుభవం, ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థాయిలకు పదోన్నతులు పొందే అవకాశం ఉంది.
Note : ఈ 6000 GPO ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
So GPO ఉద్యోగాలకు సంబంధించిన మీకు ఉపయోగపడినట్లయితే కచ్చితంగా మీ మిత్రులకు లాగే నీ బంధువులకు ఈ Article ను Share చేయండి
Important Link
Also Check
- SSC MTS & HAVALDAR Notification 2025 | SSC లో 10th Pass వాళ్లకి ఉద్యోగాలు
- 30,700+ Job Vacancy Notifications | జూన్-జూలై నెలలో 30,700 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు
- TG TET 2025 జూన్ Answer Key విడుదల – మీ Response Sheet డౌన్లోడ్ చేసుకోండి @ tgtet.aptonline.in/tgtet/
- SSC CGL Notification 2025 Full Details | 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు