Hi Friends తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న MHSRB – Medical & Health Services Recruitment Board వాళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ఉ ద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
📢 Notification
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- ఈ నియామకాలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆధ్వర్యంలో వివిధ స్పెషాలిటీలలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహించబడతాయి.
📊 Number of Vacancies & Types of Vacancy
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 607 ఖాళీలు ఉన్నాయి.
- ఇవి మల్టీ జోన్-I మరియు మల్టీ జోన్-II లలో విభజించబడ్డాయి. మొత్తం 34 స్పెషాలిటీలలో పోస్టులు ఉన్నాయి, ఉదా: అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, కార్డియాలజీ మొదలైనవి.
🎓 Qualification
- అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో MD/MS/DNB/DM/M.Ch లాంటి పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ డిగ్రీ కలిగి ఉండాలి.
- అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- కొన్ని పోస్టులకు ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి నాన్ మెడికల్ అర్హతలతో కూడిన పీహెచ్.డి కూడా పరిగణలోకి తీసుకుంటారు.
పైన ఇచ్చిన ఈ విద్యా అర్హతలు మీకు లేకపోయినా సరే మీ మిత్రులలో గాని మీ బంధువులలో గాని ఎవరికన్నా ఈ విద్యా అర్హతలు ఉంటే కచ్చితంగా వారికి ఈ ఆర్టికల్ ను Share చేయండి.
🎂 Age Limit
2025 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 46 సంవత్సరాలుగా ఉండాలి. వయస్సు సడలింపులు కిందివిధంగా ఉన్నాయి:
- SC/ST/BC/EWS: 5 సంవత్సరాలు
- PH అభ్యర్థులు: 10 సంవత్సరాలు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు: 5 సంవత్సరాలు
💰 Salary
- జీతం UGC స్కేల్స్ ప్రకారం ₹68,900 – ₹2,05,500 ఉంటుంది.
✅ Selection Process
ఎంపిక మొత్తం 100 మార్కుల ఆధారంగా జరుగుతుంది:
- 80 మార్కులు: పీజీ డిగ్రీలో సాధించిన మార్కులకు
- 20 మార్కులు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ఔట్‌సోర్స్ సేవలకు అనుభవ ఆధారంగా
అభ్యర్థులు PG అర్హత పొందిన తర్వాత చేసిన సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
📝 Examination Pattern
- ఈ రిక్రూట్మెంట్‌లో రాత పరీక్ష లేదు. ఎంపిక పూర్తిగా మెరిట్ బేస్ మరియు అనుభవ పాయింట్ల ఆధారంగా జరుగుతుంది.
📅 Important Dates
- నోటిఫికేషన్ విడుదల: 28.06.2025
- అప్లికేషన్ ప్రారంభం: 10.07.2025
- అప్లికేషన్ చివరి తేదీ: 17.07.2025
- అప్లికేషన్ ఎడిట్ చేయగల గడువు: 18.07.2025 – 19.07.2025
💵 Application Fee
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు: ₹500
- ప్రాసెసింగ్ ఫీజు: ₹200
- SC/ST/BC/EWS/PH/Ex-Servicemen & unemployed Telangana applicants (18-46 years): ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు
- ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
🖊️ How to Apply
- అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in లోకి వెళ్లి అప్లికేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లను (PDF, JPG) అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ సమర్పించిన తర్వాత Reference ID number పొందుతారు.
- తప్పులేని పక్షంలో అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.
- అప్లికేషన్‌లో తెలియజేసిన సమాచారం తప్పులేనిదిగా ఉండాలి.
So MHSRB – మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Important Links
Note : ఈ MHSRB లో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి.