AP EAMCET 2025 Counseling Dates | ఆంధ్రప్రదేశ్ EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

AP EAMCET

Hi Friends ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) వాళ్లు AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి పొందాలి అనుకునే విద్యార్థుల కోసం ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఈ ఏడాది పరీక్షకు హాజరైన వేలాదిమంది విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు పొందేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియను ఎదురుచూస్తున్నారు. ఈ AP EAMCET Counseling కి సంబందించిన పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Counseling Dates for AP EAMCET 2025 :

  • నోటిఫికేషన్ విడుదల : జూలై 5th, 2025
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు : జూలై 7th – జూలై 14th 2025
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ : జూలై 8th – జూలై 16th 2025
  • వెబ్ ఆప్షన్ ఎంట్రీ (Choice Filling) : జూలై 15th – జూలై 20th 2025
  • ఆప్షన్స్ మార్పు (Change of options) : జూలై 21st 2025
  • సీటు కేటాయింపు (ఫేజ్ 1) : జూలై 23, 2025
  • సెల్ఫ్-రిపోర్టింగ్ మరియు కాలేజీలకు హాజరు : జూలై 24 – జూలై 27, 2025

Note : Phase 1 అనంతరం ఇంకా ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి Phase 2 మరియు స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించబడతాయి.

Step-by-Step Counseling Process :

  1. నమోదు మరియు ఫీజు చెల్లింపు
    • అధికారిక వెబ్‌సైట్ https://eapcet-sche.aptonline.in ద్వారా రిజిస్టర్ చేసుకుని కౌన్సెలింగ్ ఫీజును చెల్లించాలి.
    • జనరల్/OBC అభ్యర్థులకు ₹1200, SC/ST అభ్యర్థులకు ₹600 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
  2. సర్టిఫికేట్ వెరిఫికేషన్
    • హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను అప్లోడ్ చేయాలి.
    • కొన్ని సందర్భాలలో హెల్ప్ లైన్ సెంటర్లలో ప్రత్యక్షంగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
  3. వెబ్ ఆప్షన్ ఎంట్రీ
    • అభ్యర్థులు తమ ర్యాంక్‌కు అనుగుణంగా Prefer చేసిన కాలేజీలు మరియు కోర్సులను ఎంపిక చేసుకోవాలి.
    • గత సంవత్సరాల కటాఫ్‌లను పరిశీలించి ప్రాధాన్యతలతో ఎంపికలు చేయడం మంచిది.
  4. సీటు కేటాయింపు
    • ర్యాంక్, రిజర్వేషన్ మరియు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
    • ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
  5. సెల్ఫ్-రిపోర్టింగ్ మరియు కాలేజీ రిపోర్టింగ్
    • సీటు కేటాయింపు తరువాత, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్-రిపోర్ట్ చేసి, కాలేజీకి హాజరై తమ అడ్మిషన్‌ను ధృవీకరించుకోవాలి.

Documents Required :

  • AP EAMCET 2025 ర్యాంక్ కార్డు
  • హాల్ టికెట్
  • 10th మరియు ఇంటర్ మార్కుల మెమోలు
  • ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC)
  • కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ (గత 7 సంవత్సరాలపాటు)
  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

Note : విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేస్తూ తాజా సమాచారం కోసం అప్రమత్తంగా ఉండాలి. చివరి తేదీలు మిస్ అయితే అడ్మిషన్ అవకాశం కోల్పోవచ్చు.

Important Dates :

అంశముతేదీలు
మొదటి విడత కౌన్సిలింగ్ డేట్స్జూలై 17 నుండి ఆగష్టు 2 2025 వరకు
రెండవ విడత కౌన్సెలింగ్ ప్రారంభ తేదీఆగష్టు 10 నుండి ప్రారంభం
మూడవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడురెండవ విడత కౌన్సిలింగ్ తర్వాత తేదీలు ప్రకటిస్తారు
మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభ తేదీఆగష్టు 4, 2025

Important Link :

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top