Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు మూడు రకాల ట్రైన్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Trainee ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About BEL :
- ఈ భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అనేది భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (PSU).
- ఇది అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మరియు వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీలో ప్రత్యేకత కలిగి ఉంది.
About Vacancies in BEL :
ఇందులో మొత్తం మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
- Sr.Software Trainee-I
- Jr.Software Trainee-I
- Software Professionals-I
Educational Qualification :
- Sr.Software Trainee-I
- ఈ ఉద్యోగానికి MCA, M.Sc in Computer Science చేసిన వారు అర్హులు, ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- Jr.Software Trainee-I
- ఈ ఉద్యోగానికి BCA, B.Sc in Computer Science/IT చేసిన వారు అర్హులు, ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- Software Professionals-I
- ఈ ఉద్యోగానికి BE/B.Tech in Computer Science/Information Science/Information Technology/Data Science & Engg. /Artificial Intelligence/ Artificial Intelligence Engg తో పాటు సాఫ్ట్వేర్ డుమైన్లో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
పైన ఇచ్చిన చదువు అర్హతలు మీకు లేకపోయినా సరే మీ మిత్రులలో గాని మీ కుటుంబ సభ్యులలో ఎవరికన్నా ఈ అర్హతలు ఉంటే కచ్చితంగా వాళ్లకు ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి ఉపయోగపడుతుంది.
Salaries :
మీరు ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి మీకు జీతం ఇస్తున్నారు.
- Sr.Software Trainee-I ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకి 35 వేల జీతం ఇస్తారు.
- Jr.Software Trainee-I ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 25 వేల జీతం ఇస్తారు.
- Software Professionals-I ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 60 వేల జీతం ఇస్తారు.
Note : ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు, మొదట మూడు సంవత్సరాలు పనిచేయాలి తరువాత వాళ్ళ అవసరాన్ని ఇంకా మీ పనితీరుని బట్టి పుడగించే అవకాశం ఉంది.
Age Limit :
ఉద్యోగాలని బట్టి వయస్సు అర్హత మారుతుంది.
- Sr.Software Trainee-I ఉద్యోగానికి గరిష్టంగా 28 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులే.
- Jr.Software Trainee-I ఉద్యోగానికి గరిష్టంగా 26 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులే.
- Software Professionals-I ఉద్యోగానికి గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులే.
ఇంకా ఈ ఉద్యోగాలకి మీ కేటగిరి ని బట్టి వయస్సులో సడలింపులు కూడా కల్పిస్తున్నారు.
- OBC(Non-Creamy Layer వాళ్లకి 3 సంవత్సరాల వయస్సు సడలింపు కల్పిస్తున్నారు.
- SC/ST వాళ్లకి 5 సంవత్సరాల వయస్సు సడలింపు కల్పిస్తున్నారు.
- PWBD వాళ్లకి 10 సంవత్సరాల వయస్సు సడలింపు కల్పిస్తున్నారు.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరికాస్తూ చేసుకున్న వారికి మొదట 85 మార్కులకి పరీక్ష నిర్వహించి తరువాత ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు.
Application Fee :
- ఈ ఉద్యోగాలకి SC/ST/PwBD వాళ్లకి ఎటువంటి దరిఖాస్తు Fee లేదు.
- మిగతా వాళ్ళు
- Sr.Software Trainee-I ఉద్యోగానికి 150 రూపాయలతో పాటు 18% GST చెల్లించాలి.
- Jr.Software Trainee-I ఉద్యోగానికి 100 రూపాయలతో పాటు 18% GST చెల్లించాలి.
- Software Professionals-I ఉద్యోగానికి 450 రూపాయలతో పాటు 18% GST చెల్లించాలి.
So మీకు గనక అర్హత ఉండి BEL లో ఉద్యోగం చేయాలనుకుంటే కచ్చితంగా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Important Links :
Note
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Downlode చేసుకొని సంపూర్ణంగా చదవండి.