CUET UG Results 2025 విడుదల – ఇలా చెక్ చేయండి

CUET UG Result 2025 Out Now!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూలై 4, 2025CUET UG 2025 Resultsను అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in లో విడుదల చేయడం జరిగింది . ఈ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియాలో ఉన్న పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన ఫేస్ అని చెప్పొచ్చు.

CUET UG 2025 ఫలితం ఎందుకు ముఖ్యమైంది?

  • CUET UG ద్వారా భారత దేశంలోని 240కి పైగా విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు జరుగుతాయి. అందులో 49 కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి.
  • ఈ ఫలితం ఆధారంగా విద్యార్థులు BA, BSc, BCom, BBA, BCA వంటి కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందుతారు.
  • స్కోర్‌కార్డ్‌లో సబ్జెక్ట్ వారీగా స్కోర్లు, Total స్కోరు కనిపిస్తుంది.

CUET UG 2025 Results చెక్ చేయడానికి స్టెప్స్:

  1. అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in లోకి వెళ్లండి.
  2. CUET UG 2025 Scorecard / Result” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేది / పాస్‌వర్డ్, మరియు కాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
  4. స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  5. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి – అడ్మిషన్ సమయంలో అవసరం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు

  • Results కేవలం ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి. పోస్టులో పంపించడం జరగదు.
  • మార్కింగ్ పద్ధతి: సరైన సమాధానానికి +5 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్క్.
  • తీసేసిన ప్రశ్నలకు కూడా అందరికీ పూర్తి మార్కులు ఇచ్చారు – మీరు ఆ ప్రశ్నను ప్రయత్నించకపోయినా సరే.
  • పరీక్షని చాలా షిఫ్ట్‌ల్లో నిర్వహించినందున, నార్మలైజేషన్ పద్ధతి ద్వారా మార్కులు కేటాయించబడ్డాయి.

Results తర్వాత Phases:

1. విశ్వవిద్యాలయాల కట్-ఆఫ్ మార్కులు

ప్రతి విశ్వవిద్యాలయం వారి వారి కోర్సులకు అవసరమైన కట్-ఆఫ్ స్కోర్లు ప్రకటిస్తారు. ప్రత్యేకించి BBA, BCA, BSc కోర్సులకు పోటీ ఎక్కువగా ఉంటుంది.

2. కౌన్సెలింగ్ మరియు సీటు కేటాయింపు

Results తర్వాత మీరు చేయవలసినవి:

  • మీరు ఎంచుకున్న విశ్వవిద్యాలయాల్లో కౌన్సెలింగ్‌కి రిజిస్టర్ అవ్వాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి – CUET స్కోర్‌కార్డ్, ఇంటర్ మార్కుల మెమో, ID ప్రూఫ్, క్యాటగిరీ సర్టిఫికెట్ (ఉంటే), ఫోటోలు.
  • మీకు ఇష్టమైన కోర్సులు, కాలేజీలను ఎంచుకోవాలి.

3. అడ్మిషన్ ఫీజు చెల్లింపు

మీకు సీటు కేటాయించిన తర్వాత, నిర్దేశిత సమయానికి అడ్మిషన్ ఫీజు చెల్లించి మీ సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.

విద్యార్థులకు కొన్ని సూచనలు:

  • మీ స్కోర్‌కార్డు, అవసరమైన డాక్యుమెంట్లకు బ్యాక్‌అప్ కాపీలు ఉంచుకోండి.
  • మీకు అవసరమైన విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్‌లను మరియు ఈమెయిల్‌ను తరచూ చెక్ చేయండి.
  • కౌన్సెలింగ్ సమయానికి హాజరయ్యేలా ఉండండి.
  • కోర్సులను ఎంపిక చేసేటప్పుడు మీ అభిరుచి, భవిష్యత్తు లక్ష్యాలు దృష్టిలో ఉంచుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న: Result ఎప్పుడు విడుదలైంది?
సమాధానం: జూలై 4, 2025 న విడుదలైంది.

ప్రశ్న: Results ఎక్కడ చెక్ చేయాలి?
సమాధానం: అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in లో చెక్ చేయాలి.

ప్రశ్న: Resultsలో ఏదైనా మార్పు / రీచెక్ చేయించుకోవచ్చా?
సమాధానం: లేదండి. NTA రీచెకింగ్ అనుమతించదు.

ప్రశ్న: నేను ప్రయత్నించని తొలగించిన ప్రశ్నకూ మార్కులు వస్తాయా?
సమాధానం: అవును. అందరికీ పూర్తి మార్కులు వస్తాయి.

తుది మాట

CUET UG 2025 Results దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తు కోసం కీలకం. మీరు స్కోర్‌కార్డ్ చూసాక, కట్-ఆఫ్‌లను ఫాలో అవుతూ, కాలేజీలకు అప్లై చేసుకుని, కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉండాలి. మీరు కోరుకున్న కోర్సు, విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.

All the Best!

Also Check:

RRB ALP CBT-2 స్కోర్ కార్డు 2025 విడుదల – పూర్తి వివరాలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top