Indian Govt giving 12,000 Scholarship to Students Yearly | NMMSS Scholarship పూర్తి వివరాలు

NMMSS

Hi Friends భారత ప్రభుత్వం NMMSS – National Means-cum-Merit Scholarship Scheme ద్వారా మన దేశంలో పాక్షికంగా వెనుకబడిన మరియు ప్రతిభావంతమైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదవటానికి అండగా నిలిచేందుకు సంవత్సరానికి ప్రతి విద్యార్థికి 12000 అలాగా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. ఈ NMMSS స్కాలర్‌షిప్ కి సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

💰 Scholarship Details :

  • Yearly Amount : నెలకి 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ స్కాలర్షిప్ ద్వారా ఇస్తున్నారు.
  • Duration : ఈ స్కాలర్షిప్ 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల వరకు మొత్తం 4 సంవత్సరాలు ఇస్తారు.
  • Selected Students : సుమారుగా భారతదేశ మొత్తంలో 1,00,000 మంది విద్యార్థులను ఈ స్కాలర్షిప్ కి ఎంపిక చేశారు.

✅ Eligibility Criteria :

  1. ఈ స్కాలర్షిప్ కి మీరు అర్హులు అవ్వాలి అంటే ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 8వ తరగతి చదవాలి.
  2. 7వ తరగతిలో కనీసం 55% మార్కులు వచ్చి ఉండాలి, SC/ST వాళ్లకి 50% మార్కులు వచ్చిన సరిపోతుంది.
  3. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹3,50,000 లేదా అంతకు తక్కువగా ఉండాలి.
  4. మీరు కేంద్రీయ విద్యాలయా ల్లో, జవహర్ నవదయ విద్యాలయాల్లో, ఇంకా సైనిక్ పాఠశాలలలో మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివి ఉండకూడదు.

📝 Selection Process :

ఈ NMMSS స్కాలర్షిప్ కి రాష్ట్ర స్థాయిలో రెండు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

  • Mental Ability Test (MAT) : ఇందులో 90 MCQs రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ నుంచి అడుగుతారు.
  • Scholastic Aptitude Test (SAT): 90 MCQs Science, Maths, Social Studies – 7వ & 8వ తరగతి సిలబస్ నుంచి అడుగుతారు.

ప్రతి టెస్ట్‌లో SC/ST వాళ్లకి కనీసం 32% మార్కులు రావాలి, మిగతా వారందరికీ కనీసం 40% మార్కులు రావాలి.

📆 Important Dates (2025–26 Year)

  • దరఖాస్తులు ప్రారంభం : 02 జూన్ 2025
  • దరికస్తు చివరి తేదీ : 31 ఆగస్టు 2025
  • పరీక్షా పెట్టే నెలలు : డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు (మరింత సమాచారం కోసం రాష్ట్ర విద్యాశాఖ వెబ్‌సైట్ చూడండి).
  • ఫలితాల ప్రకటన : ఏప్రిల్ నుండి మే 2026 మధ్యలో విడుదల చేస్తారు.
  • పరీక్షలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జూన్ నుండి జూలై 2026 నుంచి బ్యాంక్ ఖాతాల్లో ₹12,000 జమ చేస్తారు.

📄 Application Process :

విద్యార్థులు కేవలం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కింద Step by Step ప్రాసెస్ ఇచ్చాను చూడండి.

  1. Registration : మొదట NSP పోర్టల్‌లో ఖాతాను క్రియేట్ చేసుకోవాలి.
  2. Login : మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తో పోర్టల్ లో మళ్ళీ లాగిన్ అవ్వాలి.
  3. Application Form : దరఖాస్తు ఫారం లో అవసరమైన వివరాలను పూరించండి మరియు అందులో ‘NMMS’ స్కాలర్‌షిప్‌ను ఎంచుకోండి.
  4. Upload Documents : ఆదాయ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), నివాస సర్టిఫికేట్, క్లాస్ VII మార్క్ షీట్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించండి.
  5. Submission : చివరగా మీరు ఇచ్చిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సమీక్షించుకొని, సమర్పించండి.

🏫 State wise List :

  • తెలంగాణలో చివరి సంవత్సరం 2,921 మంది విద్యార్థులు NMMSS ద్వారా లబ్ధి పొందుతున్నారు పొందుతున్నారు.
  • ఆంధ్రప్రదేశ్లో చివరి సంవత్సరం 4,087 మంది విద్యార్థులు NMMSS ద్వారా లబ్ధి పొందుతున్నారు పొందుతున్నారు.

మీరు కూడా అర్హత ఉండి NMMSS ద్వారా స్కాలర్షిప్ పొందాలి అనుకుంటే, ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోండి. ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్ కి అర్హులు కాకపోయినా సరే మీ మిత్రులలో గాని మీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా అర్హులు ఉంటే వారికి ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి ఉపయోగపడుతుంది.

Important Links :

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top