Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న SSC (Staff Selection Commission) వాళ్లు 10th Pass అయిన వాళ్లకి Multi-Tasking (Non-Technical) Staff (MTS) మరియు Havaldar ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About SSC :
- SSC (Staff Selection Commission) అనేది భారతదేశంలో ఒక ప్రభుత్వ సంస్థ, ఇది భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థలలో వివిధ పదవులకు సిబ్బందిని నియమించడానికి బాధ్యత వహిస్తుంది.
- ఇది గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్ట్‌లను పూరించడానికి SSC CGL, SSC CHSL, SSC MTS మరియు మరిన్ని పరీక్షలను నిర్వహిస్తుంది.
- పారదర్శక మరియు మెరిట్-ఆధారిత ప్రక్రియ ద్వారా అర్హతగల అభ్యర్థులను ఎన్నుకోవడం SSC లక్ష్యం.
- So దాంట్లో భాగంగానే 2025 సంవత్సరానికి సంబంధించి MTS ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియను మొదలుపెట్టారు.
Educational Qualification :
- ఈ ఉద్యోగానికి కేవలం 10వ తరగతి పాస్ అయినవారు అర్హులు.
Salary :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం 7th CPC Level 1 ప్రకారం నెలకి 18000 నుంచి 22వేల వరకు జీతం ఇస్తారు.
- ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి జీతంతో పాటు అడిషనల్ గా మరిన్ని Allowances కూడా ఇస్తారు.
Age Limit :
- Multi-Tasking Staff (MTS) : కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- Havaldar : ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ల వరకు దరఖాస్తు.
కేంద్ర ప్రభుత్వం నియామకాల ప్రకారం మీ కేటగిరిని బట్టి వయస్సులో సడలింపులు కల్పిస్తున్నారు.
Category | Age Relaxation |
SC/ ST | 5 years |
OBC | 3 years |
PwD (Unreserved) | 10 years |
PwD (OBC) | 13 years |
PwD (SC/ ST) | 15 years |
Ex-Servicemen (ESM) | 03 years after deduction of the military service rendered from the actual a |
Selection Process :
ఈ ఉద్యోగాలకి 2 Stages లో CBT MCQ ద్వారా పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తున్నారు.
- Stage 1- Paper-1 (Objective)
- Stage 2- Physical Efficiency Test (PET)/ Physical Standard Test (PST) (ఇది హవల్దార్ ఉద్యోగాలకి మాత్రమే)
- ఇందులో Paper 1 లో 2 Sections ఉంటాయి, ఒక ప్రశ్నకు సరైన జవాబు ఇస్తే మూడు మార్కులు ఇస్తారు.
- మొదటి Section లో ఎటువంటి Negative విధానం ఉండదు కానీ రెండవ Section లో ఒక ప్రశ్నకు తప్పు జవాబు ఇస్తే ఒక మార్కు తీసివేస్తారు.
PET & PST for Havaldar Posts :
SSC Havaldar Physical Efficiency Test | ||
Particulars | Male | Female |
Walking | 1600 meters in 15 minutes | 1 km in 20 minutes |
Cycling | 8 km in 30 minutes | 3 km in 25 minutes |
SSC Havaldar Physical Standard Test | ||
Particulars | Male | Female |
Height | 157.5 cms | 152 cms |
Chest | 76 cms (unexpanded) | — |
Weight | — | 48 kg |
Language of CBT :
- ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీల తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా పెడుతున్నారు.
- ఇందులో తెలుగు మరియు ఉర్దూ భాష కూడా ఉంటుంది, మీరు CBT పరీక్షను మన సొంత భాషలో కూడా రాసుకోవచ్చు.
Examination Centers :
- ఆంధ్ర ప్రదేశ్ : చిరాలా, గుంటూర్, కకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమంద్రీ, తిరుపతి, విజయవదా, విజయపదా మరియు విశాఖపట్నంలో పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తారు.
- తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ లో పెట్టి ఎంపిక చేస్తారు.
Important Dates :
- 26th June నుంచి 24th July 2025 వరకు Online లోనే దరికాసు చేసుకోవాలి.
So మీకు అర్హత ఉండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి, అలాగే మీ మిత్రులకి గాని మీ కుటుంబ సభ్యులకు గానీ ఎవరికన్నా ఉద్యోగ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి.
Important Links :
Note :
- ఈ SSC MTS మరియు Havaldar ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Downlode చేసుకొని పూర్తిగా చదవండి.
Also Check :
- Indian Govt giving 12,000 Scholarship to Students Yearly | NMMSS Scholarship పూర్తి వివరాలు
- SBI PO Recruitment 2025 | SBI లో 541 PO ఉద్యోగాలు
- RRB NTPC 2025 Graduate level Exam – Answer Key Paper Update & Expected Cut Off Marks
- AP అన్నదాత సుఖీభవ 2025: రైతుల ఖాతాల్లోకి ₹20,000 విడుదల – రైతన్నలకు శుభవార్త!