తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 78,842 రేషన్ కార్డులని రద్దు చేసింది. ఎందుకు రద్దు చేశారో, మీ కార్డు రద్దు అయిందా లేదా అనే సమాచారం కొరకు కింద పొందుపరిచాను పూర్తిగా చదవండి.
తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది ?
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో కొన్ని ముఖ్యమైన కారణాల వలన ఈ రేషన్ కార్డు లను రద్దు చేసింది.
1. 6 నెలల పాటు రేషన్ తీసుకోకపోవడం
- ఎవరైతే ఆరు నెలల పాటు రేషన్ తీసుకోలేదు రేషన్ కార్డు ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
- దీన్ని “నిష్క్రియ కార్డులు”గా గుర్తించి తొలగించారు.
2. ఇతర రాష్ట్రాలకు మైగ్రేట్ అవడం లేదా మరణించడం
- కొన్ని కార్డులు మరణించిన వారి పేర్లతో ఉన్నాయనీ, మరికొన్ని కార్డుల యజమానులు ఇతర రాష్ట్రాలకు మారిపోయారని గుర్తించి వారి రేషన్ కార్డులను కూడా తొలగించింది.
3. ఒకే ఆధార్ తో రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్డులు
- కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి పేరుమీద రెండు కార్డులు ఉండడం గుర్తించింది.
- ఇలా ఉన్న రేషన్ కార్డులను కూడా తొలగించింది.
4. అధిక ఆదాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం
- కొన్ని కుటుంబాలలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారని తేలింది, కాబట్టి వారి ఆదాయం పెరిగినా రేషన్ కార్డు కొనసాగించడంతో అవి కూడా రద్దు చేశారు.
5. నకిలీ వివరాలు లేదా ఫేక్ ఆధార్ ద్వారా తీసుకున్న కార్డులు
- ఆధార్, పాన్, ఇతర డాక్యుమెంట్లను మాయం చేసి పొందిన ఫేక్ రేషన్ కార్డులను గుర్తించి వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
ఏ జిల్లాల్లో ఎక్కువగా రేషన్ కార్డులు రద్దు చేశారు ?
- ఎక్కువ రేషన్ కార్డులు రద్దు అయిన జిల్లాలు – హైదరాబాద్ , రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలలో అత్యధికంగా రేషన్ కార్డులను రద్దు చేశారు.
మీ రేషన్ కార్డు కూడా రద్దయిందో లేదో ఇలా చెక్ చేయండి
- మీ దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రం లేదా రేషన్ షాప్ కి వెళ్లి ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి మీ రేషన్ కార్డు రద్దు అయిందో లేదో చెక్ చేసుకోండి.
- eKYC చేయడం -ఈ రేషన్ కార్డు కొనసాగాలంటే కచ్చితంగా ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది.
- వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ రేషన్ కార్డ్ వివరాలు చూసుకోవచ్చు.
- FPS ( Fair Price Shop ) వద్ద ePOS మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు – మీ ఆధార్ లేదా రేషన్ కార్డు ఇచ్చి స్టేటస్ ని తెలుసుకోవచ్చు.
మీ రేషన్ కార్డు రద్దు అయితే ఏం చేయాలి ?
- మొదట రద్దు అయిన రేషన్ కార్డులలో మీ పేరు కూడా ఉంటే మీకు నోటీసు వస్తుంది.
- మీకు వచ్చిన ఆ నోటీసుకు సంబంధించి వివరాలు సమర్పించి మీ కార్డు పునరుద్ధరణకు అభ్యర్థించవచ్చు.
- eKYC లేదా ఆధార్ ఆధారంగా ధ్రువీకరణ జరిపి తిరిగి పునరుద్ధరించే అవకాశం కూడా ఉంటుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- జూన్ 30, 2025 లోపు మీరు కచ్చితంగా eKYC నీ పూర్తి చేసుకోండి.
- మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మరియు కుటుంబ వివరాలు అన్ని అప్డేట్ చేసుకోవాలి.
- ఏమన్నా తప్పుడు సమాచారం ఉంటే వెంటనే సరి చేసుకోండి.
- మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా నోటీసులు కానీ లేదా మెసేజ్ వంటివి వస్తే ఖచ్చితంగా వాటికి వెంటనే స్పందించండి.
ఈ చర్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన వారికి మాత్రమే రేషన్ అందేలా చూసేందుకు చర్యలు తీసుకుంటుంది. మీరు మీ రేషన్ కార్డ్ రద్దు అయ్యిందో లేదో వెంటనే చెక్ చేసుకోవడం చాలా అవసరం తప్పులుంటే వాటిని సరిచేసుకొని అవసరమైనవి అప్డేట్ చేసుకుంటే మీ కార్డు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది
Pingback: TG 10th Supplementary Exam Results 2025 | తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల తేదీలు - Manajobstelugu
Pingback: RRB NTPC 2025 Graduate level Exam - Answer Key Paper Update & Expected Cut Off Marks - Manajobstelugu