14,238 Anganwadi Vacancies in Telangana | తెలంగాణలో అంగన్వాడి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల !

Anganwadi

Hi Friends తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 14,238 అంగన్వాడి (Anganwadi) ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నియామకాలను మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW), తెలంగాణ, ఐసిడిఎస్ (ICDS) పథకం కింద నిర్వహించనుంది. ఇది రాష్ట్రంలోని బాలల సంరక్షణ మరియు పోషకాహార సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన చర్య. ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Anganwadi Notification Overview

  • తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి కార్యకర్తలు, మినీ అంగన్వాడి కార్యకర్తలు మరియు అంగన్వాడి సహాయకులు వంటి 14,238 ఉద్యోగాలని భర్తీ చేయాలని నిర్ణయించుకుంది.
  • ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు జిల్లా స్థాయిలో జరుగుతాయి మరియు ఎంపిక పూర్తిగా మెరిట్‌ ఆధారంగా జరుగుతుంది.

Number of Vacancies & Post Details

పోస్టు పేరుఖాళీల సంఖ్య
అంగన్వాడి కార్యకర్తలు3,586
మినీ అంగన్వాడి కార్యకర్తలు1,243
అంగన్వాడి సహాయకులు9,409
మొత్తం14,238

Educational Qualification

ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి వేరే వేరే విద్యార్హత ఉన్నవాళ్లు అర్హులు.

  • అంగన్వాడి కార్యకర్త / మినీ కార్యకర్త : ఈ ఉద్యోగాలకి మీరు కేవలం 10వ తరగతి (SSC) పాసవుతే అర్హులు.
  • అంగన్వాడి సహాయకులు: ఈ ఉద్యోగాలకి మీరు కనీసం 8వ తరగతి పాస్ అయినా సరే దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit

  • కనీస వయస్సు: ఈ ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల వయసు నిండి ఉన్నవాళ్లు అర్హులు
  • గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు అర్హులు
  • SC/ST/OBC/PwD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

Salary

ఈ అంగన్వాడి ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు ఇస్తారు:

  • అంగన్వాడి కార్యకర్త: రూ.11,500/- (సగటు నెలవేతనం)
  • మినీ అంగన్వాడి కార్యకర్త: రూ.7,000/-
  • అంగన్వాడి సహాయకులు: రూ.7,000/-

అదనంగా మీ ప్రదర్శన ఆధారంగా ప్రోత్సాహకాలు, అలవెన్సులు కూడా ఇస్తారు.

Selection Process

  • ఈ అంగన్వాడి ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష ఏమి పెట్టకుండా, విద్యార్హతల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ఎంపిక చేస్తారు.
  • ముఖ్యంగా ఇందులో స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • తుది ఎంపికకు ముందు డాక్యుమెంటు పరిశీలన జరుగుతుంది.
  • ఈ నియామకానికి పరీక్ష అవసరం లేదు.
  • ప్రతి జిల్లాలోని సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో డాక్యుమెంటు పరిశీలన మరియు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది.

Note : ఈ అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చూపుతుంది.

Application Process

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://wdcw.tg.nic.in
  2. అందులో అంగన్వాడి రిక్రూట్మెంట్ విభాగాన్ని ఓపెన్ చేసి.
  3. మీ జిల్లా ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాన్ని నింపాలి.
  4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సమర్పించండి.

So ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఆర్టికల్లోని సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే కచ్చితంగా మీ మిత్రులలో గాని లేదా మీ బంధువులలో గాని ఎవరన్నా అంగన్వాడీల ఉద్యోగాల కోసం చూస్తున్నవారు ఉంటే కచ్చితంగా వారికి ఈ ఆర్టికల్ ను Share చేయండి.

Important Link :

Also Check

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top