Hi Friends ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) వాళ్లు AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి పొందాలి అనుకునే విద్యార్థుల కోసం ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఈ ఏడాది పరీక్షకు హాజరైన వేలాదిమంది విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు పొందేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియను ఎదురుచూస్తున్నారు. ఈ AP EAMCET Counseling కి సంబందించిన పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Counseling Dates for AP EAMCET 2025 :
- నోటిఫికేషన్ విడుదల : జూలై 5th, 2025
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు : జూలై 7th – జూలై 14th 2025
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ : జూలై 8th – జూలై 16th 2025
- వెబ్ ఆప్షన్ ఎంట్రీ (Choice Filling) : జూలై 15th – జూలై 20th 2025
- ఆప్షన్స్ మార్పు (Change of options) : జూలై 21st 2025
- సీటు కేటాయింపు (ఫేజ్ 1) : జూలై 23, 2025
- సెల్ఫ్-రిపోర్టింగ్ మరియు కాలేజీలకు హాజరు : జూలై 24 – జూలై 27, 2025
Note : Phase 1 అనంతరం ఇంకా ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి Phase 2 మరియు స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించబడతాయి.
Step-by-Step Counseling Process :
- నమోదు మరియు ఫీజు చెల్లింపు
- అధికారిక వెబ్సైట్ https://eapcet-sche.aptonline.in ద్వారా రిజిస్టర్ చేసుకుని కౌన్సెలింగ్ ఫీజును చెల్లించాలి.
- జనరల్/OBC అభ్యర్థులకు ₹1200, SC/ST అభ్యర్థులకు ₹600 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
- సర్టిఫికేట్ వెరిఫికేషన్
- హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను అప్లోడ్ చేయాలి.
- కొన్ని సందర్భాలలో హెల్ప్ లైన్ సెంటర్లలో ప్రత్యక్షంగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
- వెబ్ ఆప్షన్ ఎంట్రీ
- అభ్యర్థులు తమ ర్యాంక్‌కు అనుగుణంగా Prefer చేసిన కాలేజీలు మరియు కోర్సులను ఎంపిక చేసుకోవాలి.
- గత సంవత్సరాల కటాఫ్‌లను పరిశీలించి ప్రాధాన్యతలతో ఎంపికలు చేయడం మంచిది.
- సీటు కేటాయింపు
- ర్యాంక్, రిజర్వేషన్ మరియు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
- ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
- సెల్ఫ్-రిపోర్టింగ్ మరియు కాలేజీ రిపోర్టింగ్
- సీటు కేటాయింపు తరువాత, అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్-రిపోర్ట్ చేసి, కాలేజీకి హాజరై తమ అడ్మిషన్‌ను ధృవీకరించుకోవాలి.
Documents Required :
- AP EAMCET 2025 ర్యాంక్ కార్డు
- హాల్ టికెట్
- 10th మరియు ఇంటర్ మార్కుల మెమోలు
- ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC)
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ (గత 7 సంవత్సరాలపాటు)
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
Note : విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేస్తూ తాజా సమాచారం కోసం అప్రమత్తంగా ఉండాలి. చివరి తేదీలు మిస్ అయితే అడ్మిషన్ అవకాశం కోల్పోవచ్చు.
Important Dates :
అంశము | తేదీలు |
మొదటి విడత కౌన్సిలింగ్ డేట్స్ | జూలై 17 నుండి ఆగష్టు 2 2025 వరకు |
రెండవ విడత కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ | ఆగష్టు 10 నుండి ప్రారంభం |
మూడవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడు | రెండవ విడత కౌన్సిలింగ్ తర్వాత తేదీలు ప్రకటిస్తారు |
మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభ తేదీ | ఆగష్టు 4, 2025 |
Important Link :
Also Check :
- ఒక్క అప్లికేషన్‌తో ₹2 లక్షలు! AP మహిళల కోసం సరికొత్త అవకాశమిది
- Supervisor jobs in Airports 2025 | పరీక్ష లేకుండా సొంత రాష్ట్ర విమానాశ్రయాల్లో సూపర్వైజర్ ఉద్యోగాలు
- Forest Department jobs 2025 | అటవీ శాఖలో ఫారెస్ట్ గాడ్, డ్రైవర్ ఉద్యోగాలు
- Railways Technician Grade 1 & Grade 3 Notification 2025 | ఇండియన్ రైల్వేస్ లో 6,238 ఉద్యోగాలు
- BTech కౌన్సెలింగ్ 2025: మూడు విడతలలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి