TG 10th Supplementary Exam Results 2025 | తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల తేదీలు

Supplementary

Hi Friends ఇటీవలే మన తెలంగాణ ప్రభుత్వం కింద పని చేస్తున్న Telangana State Board of Secondary Education వాళ్లు తెలంగాణలోని పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు Supplementary పరీక్షలను జూన్ 3వ తారీకు నుంచి జూన్ 13వ తారీకు వరకు నిర్వహించారు. దాదాపు ఈ పదవ తరగతి వ పరీక్షను 50 వేల మంది వరకు విద్యార్థులు రాశారు.

Important News :

  • ఈ పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు Supplementary పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13, 2025 వరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహించారు.
  • వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ చివరి వారంలో అంటే జూన్ 23–30 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది.
  • మీరు ఈ సప్లిమెంటరీ ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ అయినా bse.telangana.gov.in లో మీ పదవ తరగతి హాల్ టికెట్ నంబర్ ద్వారా చూసుకోవచ్చు.
  • ఫలితాలు వెబ్‌సైట్, SMS, మరియు DigiLocker లో అందుబాటులో ఉంటాయి.

How to Check Results :

  • ఈ పదవ తరగతి ఫలితాలని చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ని ఓపెన్ చేయండి.
  • ఇందులో “TS SSC Supplementary Result 2025” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
  • మీ మార్కులు, పాస్/ఫెయిల్ స్టేటస్ చూపిస్తుంది.
  • ఫలితాల్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
  • ఈ ఫలితాలని మీ మొబైల్ లో చూసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లి కూడా చూసుకోవచ్చు

ఉత్తీర్ణత ప్రమాణాలు మరియు తదుపరి ప్రక్రియ :

  • రావలసిన కనీస మార్కులు : ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35%, రెండవ భాషలో కొన్ని సందర్భాల్లో 20% మార్కులు వచ్చిన సరిపోతుంది.
  • మీరు ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో తీర్ణత సాధిస్తే, 11వ తరగతిలో ప్రవేశం కోసం సిద్ధంగా ఉండండి.
  • మీరు ఫెయిల్ అయితే, రీ-వాల్యుయేషన్ చేసుకోవడానికి ఆశ ఉంటుంది దానిని ఉపయోగించండి లేదా మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

మీరు ఇప్పుడు చేయవలసింది :

  • అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ను బుక్మార్క్ చేసుకోండి.
  • మీ సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్ రెడీగా ఉంచుకోండి.
  • ఫలితాలు చూసుకున్న తర్వాత పేరు, మార్కులు మొదలైన వాటిని సరిచూసుకోండి.
  • పాస్ అయితే ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ప్రిపేర్ అవ్వండి.

Facts About TG 10th Exams 2025 :

  • మొత్తం 10వ తరగతి పరీక్ష రాయడానికి 5,09,403 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
  • అందులో 4,96,374 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
  • ఎక్కువ పాస్ అయిన జిల్లాగా మహబూబాబాద్ – 99.29% తో ఒకటవ స్థానంలో ఉంటే,
  • తక్కువ పాసైన జిల్లాగా వికారాబాద్ – 73.97% తో చివరి స్థానంలో ఉంది.
  • మొత్తం తెలంగాణలో 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి.
  • ఇందులో బాలురు 91.32% ఉత్తీర్ణత సాధిస్తే.
  • బాలికలు 94.26% ఉత్తీర్ణత సాధించారు.
  • బాలురు లతో పోలిస్తే బాలికలు 2.94% అధిక ఉత్తీర్ణత సాధించారు.
  • 2024 లో 91.31% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే, 2025 లో మాత్రం 92.78% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

మీకు ఈ ఆర్టికల్లోని సమాచారం ఉపయోగపడినట్లయితే, మీ మిత్రులకు గాని లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఈ సమాచారం పడుతుందనుకుంటే కచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి.

Important Links :

Also Check :

1 thought on “TG 10th Supplementary Exam Results 2025 | తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల తేదీలు”

  1. Pingback: 🎓 AP EAPCET 2025 రెండవ దశ ఫలితాలు విడుదల – వెంటనే చెక్ చేయండి! - Manajobstelugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top