SSC CGL Notification 2025 Full Details | 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

SSC CGL

Hi Friends SSC CGL లో 2025 సంవత్సరానికి సంబంధించి 14,582 ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో గ్రూప్ B మరియు C పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

📌 About SSC CGL

  • SSC CGL పరీక్ష ఒక జాతీయ స్థాయి పోటీ పరీక్ష.
  • దీనిని SSC ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
  • దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, మరియు ఇతర సంస్థలలో గ్రూప్ B మరియు C ఉద్యోగాల నియామకం జరుగుతుంది.
  • ఇది నాలుగు దశలుగా (టియర్లుగా) నిర్వహించబడుతుంది.

🧾 Types of Vacancies

SSC CGL 2025 ద్వారా నోటిఫై చేయబడిన ఉద్యోగాల విభాగాలు:

  • గ్రూప్ B గెజిటెడ్
    • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (AAO)
    • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
    • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
    • ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
    • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • గ్రూప్ B నాన్-గెజిటెడ్
    • ఇన్‌స్పెక్టర్ (CBIC, నార్కోటిక్స్)
    • సబ్-ఇన్‌స్పెక్టర్ (CBI)
    • డివిజినల్ అకౌంటెంట్
  • గ్రూప్ C
    • ఆడిటర్
    • అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్
    • ట్యాక్స్ అసిస్టెంట్
    • పోస్టల్ అసిస్టెంట్
    • అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)

📊 Number of Vacancies

  • ఈ సంవత్సరం 14,582 ఖాళీలు SSC ద్వారా విడుదలయ్యాయి. అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

🎓 Educational Qualification

  • ప్రాధమిక అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
  • పోస్ట్ ఆధారిత అర్హతలు:
    • JSO (Junior Statistical Officer): డిగ్రీలో గణిత శాస్త్రం సబ్జెక్టుగా ఉండాలి లేదా ఇంటర్మీడియట్‌లో గణితంలో కనీసం 60%.
    • AAO (Assistant Audit Officer): డిగ్రీతో పాటు CA/CS/MBA/MCom వంటి పూరక అర్హతలు ఉండటం ఉత్తమం.

🎂 Age Limit (01-08-2025 నాటికి)

  • కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ఠ వయస్సు: పోస్ట్‌ను బట్టి సాధారణంగా 27 నుండి 32 సంవత్సరాలు
  • వయో సడలింపులు:
    • SC/ST: 5 సంవత్సరాలు
    • OBC: 3 సంవత్సరాలు
    • PwD: 10–15 సంవత్సరాలు

💰 Salary Structure

  • SSC CGL పోస్టులకు 7వ వేతన సంఘం ప్రకారం మంచి జీతం ఉంటుంది.
లెవెల్పే స్కేల్సగటు ఇన్-హ్యాండ్ జీతం
లెవెల్ 4₹25,500 – ₹81,100₹39,000 – ₹48,000
లెవెల్ 5₹29,200 – ₹92,300₹44,000 – ₹65,000
లెవెల్ 6₹35,400 – ₹1,12,400₹53,000 – ₹64,000
లెవెల్ 7₹44,900 – ₹1,42,400₹67,000 – ₹80,000
లెవెల్ 8₹47,600 – ₹1,51,100₹89,000 – ₹1,04,000
  • అనుబంధాలుగా: DA, HRA, TA, NPS మొదలైనవి అందుబాటులో ఉంటాయి.

📝 Selection Process

  • SSC CGL 2025 పరీక్ష నాలుగు దశలుగా నిర్వహించబడుతుంది:
  1. Tier I – కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-Objective)
  2. Tier II – కంప్యూటర్ ఆధారిత పరీక్ష
    • పేపర్ I (అందరికీ తప్పనిసరి)
    • పేపర్ II (JSO కి)
    • పేపర్ III (AAO కి)
  3. Tier III – వివరణాత్మక పరీక్ష (ఎస్సే/లేఖ/అప్లికేషన్)
  4. Tier IV – స్కిల్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్

📍 Examination Centers

  • తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ లో పెట్టి ఎంపిక చేస్తారు.
  • ఆంధ్ర ప్రదేశ్ : చిరాలా, గుంటూర్, కకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమంద్రీ, తిరుపతి, విజయవదా, విజయపదా మరియు విశాఖపట్నంలో పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తారు.

Language of CBT

  • ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీల తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా పెడుతున్నారు.
  • ఇందులో తెలుగు మరియు ఉర్దూ భాష కూడా ఉంటుంది, మీరు CBT పరీక్షను మన సొంత భాషలో కూడా రాసుకోవచ్చు.

🗓️ Important Dates

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదలజూన్ 9, 2025
అప్లికేషన్ ప్రారంభంజూన్ 9, 2025
అప్లికేషన్ చివరి తేదీజూలై 4, 2025 (11 PM)
ఫీజు చెల్లింపు గడువుజూలై 5, 2025 (11 PM)
అప్లికేషన్ సవరణ తేదీలుజూలై 9 – 11, 2025
టియర్ I పరీక్షఆగస్ట్ 13 – 30, 2025
టియర్ II పరీక్షడిసెంబర్ 2025 (అంచనా)

Application Fee

  • SSC CGL 2025 పరీక్ష ఫీజు సాధారణ, OBC మరియు EWS పురుష అభ్యర్థులకు ₹100.
  • SC, ST, మహిళలు, పీడబ్ల్యూడి (PwBD) మరియు మాజీ సైనికులకు ఫీజు లేదు.

Important Links :

Note :

  • ఈ ఉద్యోగాలకి దరికాసు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని download చేసుకొని చూడండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top